పెండింగ్ స్కాలర్ షిప్ విడుదల చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండడంతో పేద విద్యార్థులు చదువులు పూర్తయినా సర్టిఫికెట్లు తీసుకో ని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలన్నా రు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. సుశాంత్, రవికాంత్, సు మిత్, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment