బోధనకు పదును..
● కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ ● నేటి నుంచి మూడు రోజులపాటు కార్యక్రమం ● 2024 డీఎస్సీలో నియమితులైన టీచర్లకు అవకాశం ● నూతన అభ్యాసన ప్రక్రియలపై తర్ఫీదు
కెరమెరి(ఆసిఫాబాద్): వివిధ అంశాల్లో శిక్షణ పొంది ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించినప్పటికీ విద్యార్థులకు బోధించే విషయంలో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ఎంతో అవసరం ఉంది. దీన్ని గ్రహించిన రాష్ట్ర విద్యాశాఖ 2024లో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు వివిధ అంశాల్లో రిసోర్స్ పర్సన్ల ద్వారా శిక్షణ ఇప్పించాలని సంకల్పించింది. ప్రభుత్వం అందుబాటులో ఉన్న బోధన మూల్యాంకన పద్ధతులు, సమర్థ బోధనాభ్యాసన సాధనాలపై శిక్షణ అందించేందుకు డీఆర్‌సీ (జిల్లా రిసోర్స్ పర్సన్‌లకు) ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 12 మంది ఆర్‌పీలు తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్ సబ్జెక్టుల్లో పూర్తిస్థాయి శిక్షణ కల్పించనున్నారు. ఒక్కో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ విద్యార్థులకు విద్యను బోధించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో 188 మంది
2024 డీఎస్సీ ద్వారా జిల్లాలోని వివిధ మండలాల్లో 188 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు నియమితులయ్యారు. ప్రస్తుతం వారంతా విధుల్లో ఉన్నారు. అయితే నూతన విద్యావిధానం వల్ల పాఠ్యాంశాల్లో పలు మార్పులు చేశారు. 2024 డీఎస్సీ కంటే ముందు నుంచి ఆయా పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు వివిధ అంశాల్లో నిష్ణాతులై ఉన్నారు. జిల్లా, మండల స్థాయిలో పలుమార్లు బోధనాంశాలపై శిక్షణ తీసుకుని ఉన్నారు. అందుకు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు కూడా శిక్షణ కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర విద్యాశాఖ భావించింది. ఇందులో భాగంగా ఈ నెల 28న, మార్చి 1, 3 తేదీల్లో జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు ఇవ్వనున్న శిక్షణకు హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సూచించారు.
సద్వినియోగం చేసుకోవాలి
2024లో డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు నేటి నుంచి అందించే శిక్షణకు తప్పనిరిగా హాజరు కావాలి. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్‌లు బోధనాంశాలపై కల్పించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నేర్చుకున్న అంశాలను తరగతిగదిలో విద్యార్థులకు బోధించాలి. అన్ని అబ్జెక్టుల్లో విద్యార్థులు ముందుండేలా చేయాలి.
– యాదయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి
ఆవశ్యకత..
విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు పరిపక్వత, బోధన అభ్యాసన ప్రక్రియపై సరైన వ్యూహాలను ఎంచుకోవడం, మూల్యాంకనం మదింపు పద్ధతులు అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులు వాటి ఉపకరణాలు
పాఠ్య పుస్తకాల సమర్థవంతైన వినియోగం
సమర్థవంతమైన తరగతి గది ప్రకియలు
విద్యా ప్రమాణాలు, అభ్యాసన ఫలితాలు
వార్షిక, పాఠ్యాంశాల పీరియడ్ ప్రణాళిక
నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మదింపు
కంటెంట్ ఎన్‌రిచ్‌మెంట్ యాక్టివిటీస్
ఐటీసీ ఉపకరణాలను ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్‌ను డిజిటల్ కంటెంట్‌ను సమర్థవంతంగా వినియోగించడం.
ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం
స్కూల్ ఎడ్యుకేషన్ యాప్
యూడైస్ యాక్టివిటీస్ అంశాలపై శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment