ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
బెజ్జూర్: సిర్పూర్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రంగనాయక స్వామి ని కోరినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంతో పాటు శివాలయం, హనుమాన్ ఆలయం, బ్రహ్మంగారి ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, మహాశివుని అనుగ్రహం ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరినట్లు తెలిపాడు. అనంతరం మండల కేంద్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట మర్తిడి మాజీ సర్పంచ్ ఉమ్మేర లింగయ్య, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఎమ్మెల్సీ దండే విఠల్
Comments
Please login to add a commentAdd a comment