అగ్నిప్రమాదాల నివారణకు కృషి చేయాలి
రెబ్బెన: ప్లాంటేషన్‌లో అగ్ని ప్రమాదాల నివా రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్‌చార్జి మేనేజర్ జి.సురేష్ కుమార్ అన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మండల పరిధి లోని గంగాపూర్ ప్లాంటేషన్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదాల నివారణపై అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతం, ప్లాంటేషన్‌ల మీదుగా వెళ్లే ప్రజలు సిగరేట్, బీడీ, చుట్టలు తాగి నిర్లక్ష్యంగా పడేయడంతో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్లాంటేషన్‌లు పరిసర ప్రాంతాల వారికి స్వచ్ఛమైన గాలిని అంది స్తూ పర్యావరణానికి ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వాచర్‌లు వెంకటేష్, గంగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment