విద్యాసంస్థలపై చర్యలకు వినతి
ఆసిఫాబాద్‌రూరల్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ ఇటీవల ఖమ్మంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలో యోగ నందిని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న విద్యాసంస్థలను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆసంఘం నాయకులు సుశాంత్, అరుణ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment