జన్నారం: మంచిర్యాల కలెక్టరేట్ ఆవరణలో శని, ఆదివారాల్లో కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జన్నారం రేంజ్ అధికారి సుష్మారావు ఒక ప్రకటనలో తెలిపా రు. కవ్వాల్ టైగర్‌జోన్‌లో కనిపించే వివిధ రకాల పక్షులు, వాటి వివరాలు, జీవ వైవిధ్యంలో వాటి పాత్రపై వివరిస్తారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల ప్రక్షి ప్రేమికులు, పక్షుల అ ధ్యయనం చేసేవారు, ఎన్‌జీవోలు, జిల్లా అటవీ అధికారులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు పక్షులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యం, అడవుల ప్రయోజనాలను అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment