‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో డీఈవో యాదయ్య, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న ‘పది’ పరీక్షల కోసం జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,779 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, వెలుతురు, నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రభాకర్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి జరుగనున్న ఇంటర్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని రా ష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అ న్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా ల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్ పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఐఈవో కళ్యాణి, విద్యుత్, పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యతపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్మిక, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, పరిశ్రమలు, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, షెడ్యూల్ కులాల సంక్షే మం, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, సెర్ప్, మెప్మా అధికారులతో నిరుద్యోగ యువత–శిక్షణ–ఉపాధి కల్పన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతుల కు జ్యూట్ బ్యాగుల తయారీ, ఎంబ్రాయిడరీ రంగా ల్లో, యువకులకు భవన నిర్మాణ రంగం, పీవోబీ, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, మార్బుల్, ప్లంబింగ్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ అధికారి దత్తారాం, డీటీడీవో రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి
ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న సిమెంటు పనులను మార్చి నెలాఖరులోగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అ న్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్‌డీఏ దత్తారాంలతో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో ఉపాధి హామీ పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన జీపీ, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, నర్సరీల నిర్వహణ పనుల్లో కూలీల హాజరు శాతం పెంపుదలపై అధికా రులు దృష్టి సారించాలన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు.
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Comments
Please login to add a commentAdd a comment