‘శ్యాంనాయక్ వ్యాఖ్యలు సరికాదు’
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను ఆ
పార్టీ నాయకులు మూకుమ్మడిగా ఖండించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వాంకిడి, తిర్యాణి, రెబ్బెన, కెరమెరి మండలాల అధ్యక్షులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలను నిరుత్సాహపరిచేలా ఉండరాదన్నారు. పార్టీ అధ్యక్షుడితో పాటు నలుగురిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఐదు మండలాల నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వసంత్‌రావ్ మాట్లాడుతూ శ్యాంనాయక్ కలుపు మొక్కల వంటి కొంతమందిని వెంటేసుకుని పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు. అనీల్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన వారిని క్షమించే ప్రసక్తేలేదన్నారు. కెరమెరి మండల అధ్యక్షుడు కుసుంబరావ్ మాట్లాడుతూ శ్యాంనాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు చరణ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, నాయకులు దేవాజీ, గాదెవేణి మల్లేశ్, ఆసిఫ్, దీపక్‌ముండే, రవీందర్, మారుతీపటేల్, చిట్ల నారాయణ, బాబురావ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment