విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రతీ ఉపాధ్యాయుడు బోధనలో మెలకువలు నేర్చుకుని విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల నూతనంగా వచ్చిన 183 మంది కొత్త టీచర్లకు నైపుణ్య శిక్షణ కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఇంటరాక్టీవ్ ఫ్టాట్ ప్యానల్‌ను, డిజి టల్ కంటెంట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో ప్రా రంభ పరీక్ష, మధ్య, అంత్య పరీక్ష ఫలితాలు నమో దు చేయాలన్నారు. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు సాధించేలా విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, హెచ్‌ఎం సుభాష్, రిసోర్స్ పర్సన్ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సేవలతోనే గుర్తింపు
ఆసిఫాబాద్‌రూరల్: ఉద్యోగి తన వృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తేనే సమాజంలో గుర్తింపు పొందుతారని డీఈవో యాదయ్య అన్నారు. ఇటీవల ఇన్‌చార్జి డీఈవో కార్యాలయ సహాయ సంచాలకులుగా పనిచేసిన గమానియల్ శుక్రవారం జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని శాలువాతో సత్కరించారు. ఎస్‌వో శ్రీనివాస్, ఎంఈవో సుభాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment