ప్రతీ ఉద్యోగికి రిటైర్మెంట్ సహజం
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రతీ ఉద్యోగికి రిటైర్మెంట్ సహజమని జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి సంపత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీపీఆర్వో కార్యాలయంలో పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ పొందిన వసంత్‌కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత్‌కుమార్ సదరు విభాగానికి నిబద్ధతతో సేవ చేశారని కొనియాడారు. సర్వీసు మొత్తంలో ఎలాంటి రిమార్కు లేకుండా సేవలందించడం గొప్పతనమన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రమేశ్, పాషా, వెంకటేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుల్‌కు సన్మానం
జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన జగ్గారావ్ దంపతులను జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావ్ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ కరుణాకర్, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయ శంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు స్వామి, ఎంటీవోఆర్‌ఐ అంజన్న, డీపీవో ఏవో శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment