మహిళలు, చిన్నారుల
రక్షణకు తొలి ప్రాధాన్యత
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళలు, చిన్నారుల రక్షణే పోలీసుశాఖ తొలి ప్రాధాన్యత అని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షీటీం, భరోసా కేంద్రం బృందాల ద్వారా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు ధైర్యంగా ముందుకొస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో, షీటీం, పోలీసు అధికారుల ద్వా రా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరిలో షీటీం ద్వారా 65 హాట్‌స్పాట్ ప్రదేశాలు గుర్తించామన్నారు. 14 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించామని, రెండు ఫిర్యాదులు స్వీకరించా మని వెల్లడించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా రెండు షీటీంలు పనిచేస్తున్నాయన్నారు. బాధితులు ఆసిఫాబాద్ డివిజ న్ షీటీం నంబర్ 87126 70564, కాగజ్‌నగర్ షీటీం నంబర్ 87126 70565, డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.
జిల్లాలో 30 పోలీసు యాక్టు కొనసాగింపు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో శాంతిభద్రతలు, ప్రశాంతత పెంపొందించేందుకు ఈ నెల 31 వరకు 30 పోలీసు యాక్టు(1861) కొనసాగిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించొద్దని సూచించారు. లౌడ్ స్పీకర్లు, డీజేలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment