మొదటి విడత ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతగా పైలెట్ గ్రామాల్లో ఎంపికై న లబ్ధిదారుల ఇళ్ల బేస్‌మెంట్ నిర్మాణంపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ పైలెట్ గ్రామాల్లో బేస్‌మెంట్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తయితే నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఎల్– 1, ఎల్– 2 జాబితాలపై సర్వే పూర్తిచేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment