బ్యాంకులకు కట్టుదిట్టమైన భద్రత అవసరం
ఆసిఫాబాద్‌అర్బన్: ఇటీవల పలు బ్యాంకుల్లో చోరీలు జరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని బ్యాంకులకు కట్టుదిట్టమైన భద్రత అవసరమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శనివా రం ఆసిఫాబాద్ సబ్ డివిజన్‌లోని పలు బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకు లోపల, వెలుపల అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో ఉండే సెక్యూరిటీ అలారం ప్రా ముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏటీఎంలో నగదు నింపే సమయంలో అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రవీందర్, రమేశ్, సత్యనారాయణ, ఎస్సైలు చంద్రశేఖర్, సాగర్, శ్రీకాంత్ విజయ్, ప్రశాంత్, బ్యాంకు కంట్రోలర్స్, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment