ఏరియాలో 114శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): ఫిబ్రవరిలో బెల్లంపల్లి ఏరియా 114 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి వెల్ల డించారు. గోలేటి టౌన్‌షిప్‌లోని కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏ ర్పాటు చేశారు. ఫిబ్రవరిలో ఏరియాకు 3.60 లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఏరియా 4.09 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ఏరియాలో కై రిగూ డ ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోందని, ఈ ఓసీపీకి ద్వారా 4.09 లక్షల టన్నుల బొగ్గు సాధించామని పేర్కొన్నారు. వార్షిక ఉత్పత్తి సాధనలో ఏరియా 95 శాతంతో ముందుకు సాగుతోందని, ఈ నెలాఖరు నాటికి వందశాతం ఉత్పత్తి సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గోలేటి ఓసీపీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. గోలేటి, మాదారం ఓసీపీలు ఏర్పాటైతే ఏరియా పూర్వవైభవం సంతరించుకుంటుందన్నారు. ఈ సమావేశంలో ఎస్‌వోటూ జీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment