ఆదివాసీలకు అండగా ఉంటాం
తిర్యాణి(ఆసిఫాబాద్): ఆదివాసీ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. తిర్యాణి మండలం గోవెనా పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామాలైన కుర్సిగూడ, లింగిగూడ, నాయకపుగూడలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ యువత ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక శక్తులకు సహకరించొ ద్దని సూచించారు. సమస్యలు పోలీసుల దృష్టికి తీసుకువస్తే.. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యతోనే ఆదివాసీల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చిన్నారులను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించా లని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ బుద్దె స్వామి, ఎస్సై శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment