4, 5 తేదీల్లో బెజ్జూర్‌లో వైద్యశిబిరం
ఆసిఫాబాద్: జిల్లా అటవీశాఖ, సింగరేణి కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5 తేదీ ల్లో బెజ్జూర్ మండల కేంద్రంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మె డిసన్, కీళ్ల వైద్య నిపుణులు, సీ్త్ర వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. స్థానిక గ్రామాల ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేడు కార్యకర్తల సమావేశం
కౌటాల: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ వస్తారని, ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని తెలిపారు. మండలంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశానికి సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment