‘వలస వ్యాపారులను కట్టడి చేయాలి’
ఆసిఫాబాద్‌రూరల్: స్థానిక వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వలస వ్యాపారులను కట్టడి చేయాలని ఎమ్మార్పీస్ జిల్లా అధికార ప్రతినిధి మహేశ్ డిమాండ్ చేశారు. మండలంలోని అంకుసాపూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు స్థానిక వ్యాపారులను ఇబ్బందులుకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, యువత కూడా ఉపాధికి దూరమవుతున్నారన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాకు చెందిన కూలీల సంఖ్య పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, పెంటు, రాము, దాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment