ఆర్టీసీ డీఎంను సస్పెండ్ చేయాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో పనిచేస్తున్న కార్మికులను వేధింపులకు గురిచేస్తున్న డిపో మేనేజర్ విశ్వనాథ్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల హేమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, కార్మిక సంఘం నాయకులు కేఎస్‌రావ్ సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే సర్వీసులను నడిపితే మూడు రోజుల పని ది నాలుగా ఇస్తుండగా రెండు రోజులకు కుదించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. డ్రంకెన్ డ్రైవ్ పేరుతో పనిచేయని మిషన్‌తో టెస్టులు చేయించి కార్మికులపై తప్పుడు నివేదికలు ఇచ్చి సస్పెండ్ చేయడం, సర్వీస్ నుంచి రిమూవల్ చేయడం వంటి కుట్రలకు పాల్ప డుతున్నారన్నారు. ఆర్‌ఎంను ట్రాన్స్‌ఫర్ చేసి మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు కేశవరెడ్డి, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment