విజయీభవ
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కు జిల్లాలో 19కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,054 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,756 మంది ఫస్టియర్, 5,287 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కళ్యాణి వెల్లడించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమ ని తెలిపారు. అన్ని కేంద్రాల్లో బెంచీలు, తాగునీరు, ఫ్యాన్లు, మూత్రశాలలు తదితర వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా ప్రతీ పరీక్షాకేంద్రంలో ఐదు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఐదు నిమిషాలు ఆలస్యమైనా..
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ‘నిమిషం’ నిబంధన తొలగించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు అంటే ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరికి వారు తమకిచ్చిన పత్రంపై తమ వివరాలే ఉన్నాయా? లేదా? అని సరిచూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు నిర్ధిష్ట సమయానికంటే ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకోవడం మంచిది.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో..
ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ఈసారి సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నా రు. ఇప్పటికే అన్ని పరీక్షాకేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక స్క్వాడ్స్‌తో కేంద్రాలను తనిఖీ చేయనున్నా రు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రతీ పరీక్షాకేంద్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. పరీక్షల నిర్వహణకు 19 కేంద్రాల్లో 192 మంది ఇన్విజిలేటర్లు, 19 మంది సీఎస్‌లు, 19 మంది డీవోలతోపాటు రెండు సిట్టింగ్ స్క్వాండ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ కూడా పరీక్షాకేంద్రాలను పర్యవేక్షించనున్నారు. ఆయా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రతీ సెంటర్‌కు ఇద్దరు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. కేంద్రానికి సమీపంలోని జిరాక్స్, ఇంటర్‌నెట్ సెంటర్లను పరీక్ష ముగిసేదాకా మూసి ఉంచాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలోని పరీక్షాకేంద్రాల వివరాలు
ప్రాంతం పరీక్షాకేంద్రం పేరు
ఆసిఫాబాద్ ప్రభుత్వం జూనియర్ కళాశాల
ఆసిఫాబాద్ గిరిజన గురుకుల బాలుర పాఠశాల
ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
ఆసిఫాబాద్ గిరిజన బాలికల గురుకుల పాఠశాల
వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల
కెరమెరి ప్రభుత్వ జూనియర్ కళాశాల
రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల
కాగజ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
కాగజ్‌నగర్ (గన్నరాం) ఎంజేపీ పాఠశాల
కాగజ్‌నగర్ వివేకానంద జూనియర్ కళాశాల
కాగజ్‌నగర్ వసుంధర్ జూనియర్ కళాశాల
కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాల
జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
బెజ్జూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
దహెగాం ప్రభుత్వ జూనియర్ కళాశాల
సిర్పూర్(యూ) తెలంగాణ మోడల్ స్కూల్
సిర్పూర్(టి) ప్రభుత్వ జూనియర్ కళాశాల
తిర్యాణి ప్రభుత్వ జూనియర్ కళాశాల
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు షురూ
ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఎంట్రీ
హాజరు కానున్న 10,054 మంది
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
నిర్భయంగా పరీక్ష రాయాలి
ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 19 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతీ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా పరీక్షలు రాయాలి.
– కళ్యాణి, డీఐఈవో
పరీక్షాకేంద్రాల వద్ద బందోబస్తు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షాకేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్ ఎస్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావ్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రాల వద్ద పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల సమీప జిరాక్స్, ఇంటర్ నె ట్ సెంటర్లు మూసి ఉంచాలని పేర్కొన్నా రు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విజయీభవ
విజయీభవ
Comments
Please login to add a commentAdd a comment