ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆసిఫాబాద్‌రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ పలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీటీడీవో రమాదేవి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన సబ్జెక్టు టీచర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో 36 ఆశ్రమ పాఠశాలల్లో 1,255 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపా రు. జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా సబ్జెక్టు టీచర్లు కృషి చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సా రించాలని సూచించారు. 100 శాతం ఫలితా లు సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకోవా లని తెలిపారు. ఏసీఎంవో ఉద్ధవ్, డీఎస్వో మీనారెడ్డి, ఏటీడీవో చిరంజీవి, ఎస్వో సంతోష్, సాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పొలం బాట
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించి వ్యవసాయానికి నాణ్యమై న విద్యుత్ అందించేందుకే ‘పొలం బాట’ నిర్వహిస్తున్నట్లు ఆసిఫాబాద్ సర్కిల్ ఎస్‌ఈ రాథోడ్ శేషారావ్ తెలిపారు. పొలం బాట కార్యక్రమంలో సేవలందించిన అధికారులు, సిబ్బందిని ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్కిల్ పరి ధిలో ఇప్పటివరకు 36 వంగిన స్తంబాలు, 43 లూజ్‌లైన్లు, 14 మధ్య స్తంభాలు సరి చేసిన ట్లు తెలిపారు. ఆటో స్టార్టర్లు తొలగించాలని రైతులకు సూచిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
డీఎంపై చర్య తీసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులను వేధిస్తున్న డీఎం విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో కార్మికులతో కలిసి టీజీఎస్ ఆర్టీ సీ ఎండీ కార్యాలయంలో ఈడీ మునీశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ.. కొంత కాలంగా డీ ఎం కార్మికులపై అధిక పనిభారం మోపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించా రు. కార్మికులు పని ఒత్తిడి తట్టుకోలేక అనా రోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. కార్మి కులకు క్యాజువల్ లీవ్‌లు కూడా ఇవ్వడం లేద ని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నుంచి హైదరా బాద్‌కు వెళ్లే సర్వీసులను నడిపితే మూడురోజుల పని దినాలను రెండు రోజులకు కు ధించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించా రు. పని చేయని యంత్రాల ద్వారా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ కార్మికులపై తప్పు డు నివేదికలు ఇచ్చి సస్పెన్షన్, తొలగింపు కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు. డీఎం, ఆర్‌ఎం చర్యలపై విచారణ చేపట్టి చ ర్య తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో బస్ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశం కోసం ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఐదోతరగతిలో ప్రవేశం కోసం గిరిజన విద్యార్థులకు ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో కుష్ఫూ గుప్తా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గలవారు నాలుగో తరగతి చదువుతూ 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. 5 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌లాగ్ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు డీఎస్వో మీనారెడ్డిని 9440010453 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment