‘పది’లో పాత విధానమే..!
● వార్షిక పరీక్షలో ‘గ్రేడింగ్’ రద్దు ● మార్కుల విధానం మళ్లీ అమలు ● సవరణలు చేసిన విద్యాశాఖ
ఆసిఫాబాద్‌అర్బన్: ఈనెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్ష ల విధానంలో విద్యాశాఖ పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న గ్రేడింగ్ (జీపీఏ) విధానాన్ని రద్దు చేసింది. పూర్వ పద్ధతిలోనే మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే నాలుగు పేజీల జవాబు పత్రాల స్థానంలో 24పేజీల బుక్‌లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థులకు సరిపడా బుక్‌లెట్లు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,421 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
నాలుగు చోట్ల రిసీవింగ్ కేంద్రాలు
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, జైనూర్, కౌటా లలో రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేంద్రాలకు 24 పేజీలు కలిగిన ఆన్సర్ బుక్‌లెట్లు చేరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో సీఎస్ పర్యవేక్షణలో రిసీవింగ్ సెంటర్ల నుంచి ప్రశ్నాపత్రాలతో పాటు ఆన్సర్ బుక్‌లెట్లను పరీక్షాకేంద్రాలకు తరలించనున్నారు. ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్‌తో పాటు ప్రతీ పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, మెడికల్ సిబ్బంది, సీఎస్ విధులు నిర్వహించనున్నారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే..
రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం పదోతరగతి పరీ క్షా విధానంలో నూతన మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో మార్కుల విధానాన్ని అమలు చేస్తోంది. జవాబు పత్రాల స్థానంలో 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు పరీక్షల నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
– ఎం.ఉదయ్‌బాబు, జిల్లా పరీక్షల సహాయాధికారి
జిల్లాకు సంబంధించిన వివరాలు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు :
172
పదో తరగతి పరీక్షా కేంద్రాలు :
36
హాజరు కానున్న విద్యార్థులు :
6,421
Comments
Please login to add a commentAdd a comment