నిరుపేదల కోసమే వైద్యశిబిరాలు
● జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్ ● బెజ్జూర్‌లో హెల్త్‌క్యాంప్ ప్రారంభం
బెజ్జూర్: నిరుపేదల కోసమే అటవీశాఖ, సింగరేణి ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అటవీశాఖ క్షే త్ర అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కాగజ్‌నగర్ డివిజన్ అధికారి సుశాంత్ సు గ్దేవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం డీఎఫ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలోని మారుమూల మండలంలో వైద్యశిబిరం నిర్వహణకు సింగరేణి సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నా రు. డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని నిరుపేదల కోసం వైద్యశిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అన్ని రకాల వైద్యనిపుణులతో శిబిరంలో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం కూడా శిబిరం కొనసాగుతుందని, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. రాబోవు రోజుల్లో నెలకోసారి ఆయా మండలా ల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా రోగులు భారీసంఖ్యలో వచ్చి శిబిరంలో పరీక్షలు చేయించుకుని మందులు పొందారు. సింగరేణి సంస్థ సూపరింటెండెంట్ మధుకుమార్, వైద్యులు రాధాకృష్ణ, స్టాలిన్, శ్రీదేవి, బెజ్జూ ర్ ఎఫ్‌ఆర్వో ముసవీర్, సెక్షన్ అధికారులు శ్రావణ్‌కుమార్, మల్లికార్జున్, బీట్ అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment