ఆసిఫాబాద్‌అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉన్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన మల్క కొమురయ్య గెలుపొందడంతో మంగళవా రం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద పార్టీ సీ నియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావ్‌తో కలిసి సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులతోపాటు ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. సీఎం, మంత్రులు పాలన పక్కనబెట్టి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలకు ప్రజలు ఆకర్షితులై బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు, మేధావులు ముందుచూపుతో బీజేపీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొము రయ్యను గెలిపించారని తెలిపారు. పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లికార్జున్, నాయకులు మురళి, జయరాజ్, పెంటయ్య, అశోక్, శ్రీకాంత్, సుగుణాకర్, ప్రసాద్‌గౌడ్, వెంకన్న, మధు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment