● చింతలమానెపల్లి మండలంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మ
త్వరలో ప్రారంభిస్తాం
రవీంద్రనగర్– 2 సబ్‌స్టేషన్‌ను పూర్తి ఆధునికంగా నిర్మిస్తున్నాం. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా నిర్మాణం చేపడుతున్నాం. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో ఈజ్‌గాం 132/33 సబ్‌స్టేషన్‌పై లోడ్ తగ్గుతుంది. భవిష్యత్తులో ఈ సబ్‌స్టేషన్‌లో సమస్యలు తలెత్తితే ఈజ్‌గాం నుంచి కౌటాలకు నేరుగా సరఫరా చేస్తున్నాం. కాగజ్‌నగర్ డివిజన్‌లోని కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లో చాలావరకు విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయి.
– శేషారావు, సూపరింటెండెంట్ ఇంజినీర్, జిల్లా విద్యుత్ శాఖ
చింతలమానెపల్లి(సిర్పూర్): గాలి వీచినా.. వాన ప డినా కరెంట్ నిలిచి పోవాల్సిందే.. మండల కేం ద్రం, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా తర చూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.. ఇకపై ఈ కరెంట్ కష్టాలకు చెక్ పడనుంది. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్–2 సమీపంలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. వచ్చే నెల రోజుల్లో ఈ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభించనున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈజ్‌గాం సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుండగా, దూరం కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నా యి. సిర్పూర్(టి), చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్ మండలాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నతరహా పరిశ్రమలు, దుకా ణాలు, జిన్నింగ్ మిల్లులు, రైస్‌మిల్లుల యజమానులకు నష్టాలు ఎదురవుతున్నాయి. ఇళ్లలో నీటి సరఫరాకు ఇ బ్బంది పడే పరిస్థితి. కొత్త సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే కరెంట్ కష్టాలు తీరనున్నాయి.
అతి పొడవైన విద్యుత్‌లైన్
సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాంలోని 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి గ్రామీణ మండలాలకు విద్యుత్ సరఫరా చే సే లైన్‌ను జిల్లాలోనే అతి పొడవైన లైన్‌గా చెబుతుంటారు. సుమారుగా వంద కిలోమీటర్ల దూరం వరకు ఈ లైన్ ఉంటుంది. 33కేవీ సామర్థ్యం కలిగిన 8 సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సు మారుగా 300 ఆంప్స్ లోడ్ కలిగిన విద్యుత్‌ను ఈజ్‌గాం నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ మార్గంలో వి ద్యుత్ లైన్‌కు అటవీప్రాంతంలోని చెట్లు అడ్డంకిగా ఉన్నాయి. పిడుగులు, ఉరుములు, భారీ వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతోనూ తరచూ సమస్యలు వస్తున్నారు. ఎక్కడ సమస్య ఏర్పడినా సరఫరాలో అంతరాయం తలెత్తి విద్యుత్ నిలిచిపోతుంది. పొడవైన ఈ లైన్ వెంబడి తీగలు తెగిపోవడం, ఇన్సులేటర్లు పగిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఉద్యోగులకు సమస్య ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సరఫరా పునరుద్ధరించడం తలకు మించిన భారంగా మారింది. వర్షాకాలంలో రాత్రిపూట అటవీప్రాంతంలో మరమ్మతులు చేయడం క త్తిమీద సాములా తయారైంది.
ప్రత్యామ్నాయంగా సబ్‌స్టేషన్ నిర్మాణం
విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయానికి కాగజ్‌నగర్ మండలంలోని ఈస్‌గాం సబ్‌స్టేషన్ నుంచి వందకిలోమీటర్ల దూరం వరకు కరెంట్ సరఫరా చేయడమే ప్రధాన కారణం. ఈ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. కౌటాల మండలంలో ప్రత్యామ్నాయంగా 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది. ఏళ్లుగా ప్రజల నుంచి డిమాండ్ రావడంతో చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ సమీపంలో 132/33 సబ్‌స్టేషన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.3.5 కోట్ల నిధులను కేటాయించగా.. కాగజ్‌నగర్ నుంచి టవర్‌లైన్ మంజూరైంది. కరెంట్ సరఫరాకు అంతరాయం లేకుండా 165 టవర్లు, సబ్‌స్టేషన్.. మొత్తంగా రూ.32 కోట్లతో పనులు చేపట్టారు. 2023 అక్టోబర్‌లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం తుదిదశకు చేరుకున్నాయి.
భారీ ట్రాన్స్‌ఫార్మర్లు
132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో మొత్తంగా నాలుగు విద్యుత్ సరఫరా ఫీడర్లు ఏర్పాటు చేయనున్నారు. సిర్పూర్(టి), లోనవెల్లి, కౌటాల, గుండాయిపేట్, రవీంద్రనగర్, ఖర్జెల్లి, బెజ్జూర్ మండలంలోని రెబ్బెన సబ్‌స్టేషన్ల పరిధిలోని సుమారుగా 300 గ్రామాలకు ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు. అలాగే ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించిన ఐదు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక ఫీడర్‌పై రెండు సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. ఎనిమిది సబ్‌స్టేషన్లు, 161 కిలోమీటర్ల విద్యుత్ లైన్లకు సరఫరా చేయడానికి 16 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో లోడ్ పెరిగినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ సబ్‌స్టేషన్‌ను పర్యవేక్షించేందుకు ఏడీ, ఏఈ స్థాయి అధికారులు, మరో ముగ్గురు సబ్‌స్టేషన్ నిర్వహణ సిబ్బందిని నియమించనున్నారు.
● చింతలమానెపల్లి మండలంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మ
Comments
Please login to add a commentAdd a comment