దాహం తీర్చండి సారూ..!
చెలిమె నీళ్లే దిక్కు
ఆసిఫాబాద్‌అర్బన్: వాంకిడి మండలం పాటగూ డ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామస్తులు ‘దాహం తీర్చండి సారూ’ అంటూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం ఖాళీ బిందెలతో నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం గ్రామస్తులు, ప్ర జా సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 25 కుటుంబాలు, 200 మంది ప్ర జలు నివసిస్తున్నారని తెలిపారు. గ్రామంలోని బోర్ల వద్ద అర్ధరాత్రి నుంచి వేచిచూడాల్సి వ స్తుందన్నారు. ఒక బిందె నిండేందుకు గంటకుపైగా సమయం పడుతోందని తెలిపారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి గ్రామంలో పర్యటించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కలెక్టరేట్‌లో ఏవో మధుకర్, మిషన్ భగీరథ డీఈ ఇర్ఫాన్‌కు వేర్వేరుగా వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాలశ్రీ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, నాయకులు శ్రావణి, కృష్ణమాచారి, జలపతి, గ్రామ పటేల్ ధర్మూ తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టరేట్ ఎదుట కొలాంగూడ గ్రామస్తుల ధర్నా
దాహం తీర్చండి సారూ..!
Comments
Please login to add a commentAdd a comment