తొలిరోజు ప్రశాంతం
పరీక్షలు సజావుగా
నిర్వహించాలి
ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల, తెలంగాణ మోడల్ స్కూల్‌లోని కేంద్రాలను సందర్శించారు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
● ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 5,076 మంది విద్యార్థులకు 4,828 మంది హాజరయ్యారు. 248 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 4,283 మందికి 4,100 మంది, ఒకేషనల్ విభాగంలో 793 మందికి 728 మంది హాజరయ్యారు. తొలిరోజు కావడంతో విద్యార్థులు ఉదయమే కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 గంటల నుంచి సెంటర్లలోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ తావులేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఐఈవో కళ్యాణి తెలిపారు. వాంకిడి, కాగజ్‌నగర్, రెబ్బెనలోని కేంద్రాలను ప్లయింగ్ స్క్వాడ్ సభ్యులు తనిఖీ చేశారు.
కేంద్రాలు తనిఖీ
జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, పీటీజీ బాలుర, బాలికల గురుకులాల్లోని కేంద్రాలను డీఐఈవో కళ్యాణి, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, ఆసిఫాబాద్ సీఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు ప్రశాంతం
తొలిరోజు ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment