సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: అధికారులు, ప్రజాప్రతినిధుల సమస్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వసతి గృహాల్లో రాత్రిపూట బస చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా జనవరి నుంచి ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ట్రాన్స్‌ఫార్మర్లు మార్చడంతో పాటు విద్యుత్ లైన్లు సరి చేస్తున్నామని వివరించారు. ఏడాదిలో ఈ ప్రాంతం గురించి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలతో మమేకమై అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో సంక్షేమంపై దృష్టి సారిస్తానని తెలిపారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం గుండి రహదారిలోని ఓ ప్రైవేటు భవనంలోకి మార్చినట్లు సబ్ రిజిస్ట్రార్ అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొత్త భవనంలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment