అసాంఘిక శక్తులకు సహకరించొద్దు
● ఏఎస్పీ చిత్తరంజన్
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అసాంఘిక శక్తులకు సహకరించొద్దని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. సిర్పూర్(యూ) మండలం రుద్దేకాస గ్రామంలో బుధవారం పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతిఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులకు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేశ్, సిర్పూర్(యూ) ఎస్సై రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
యువత ఉన్నతస్థాయికి ఎదగాలి
కెరమెరి(ఆసిఫాబాద్): యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ.. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండలంలోని మారుమూల టోకెన్‌మోవాడ్, చాల్‌బాడి, పాటాగూడ, పిట్టగూడ గ్రామాల్లో బుధవారం బైక్‌పై పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు. గంజాయి సాగు చేయొద్దని, విద్యుత్ తీగలతో వన్యప్రాణులను వేటాడొద్దన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యానారాయణ, ఎస్సై గంపుల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment