గడువు!
ముంచుకొస్తున్న
● జిల్లాకు ఈజీఎస్ ద్వారా 354 పనులు మంజూరు ● 174 పనులు మాత్రమే గ్రౌండింగ్ ● ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు ● రోడ్లు సకాలంలో పూర్తికాకుంటే నిధులు వెనక్కి..
రెబ్బెన మండలం బాలాజీ నగర్‌లో
సీసీరోడ్డు మంజూరైన అంతర్గత రోడ్డు
354 పనులు.. రూ.13 కోట్లు
జిల్లాలోని 15 మండలాలకు ప్రభుత్వం రూ.13 కోట్ల ఈజీఎస్ నిధులతో 354 పనులు మంజూరు చేసింది. అన్ని మండలాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధికే ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత క్రమంలో సీసీ రోడ్ల కోసం ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. ప్రభుత్వం ఆ మోద ముద్రవేసింది. గత నెలలోనే సీసీరోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉండగా ఈసారి ఆలస్యంగా మొదలయ్యాయి. 354 పనుల్లో ఇప్పటివరకు కేవలం 174 పనులు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. మిగిలిన పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ వా రంలోనే మిగిలిన పనులు ప్రారంభించి, ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మార్చి 31లోగా పూర్తవుతాయా.. లేదా అనేది అనుమానంగా మా రింది. వారంలోగా రోడ్ల నిర్మాణానికి కావా ల్సిన ఇసుక, కంకర, మిషనరీ, కూలీలను సమకూర్చుకోవడం కష్టతరంగా మారనుంది. గడువు దాటిన తర్వాత పూర్తయితే బిల్లులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాకు మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తారా.. లేక చేతులు ఎత్తేస్తారా అనేది చూడాలి.
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామాల్లో చిన్నపాటి వర్షాలకే చిత్తడిగా మారే రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం నిధులతో సీసీరోడ్లు మంజూరు చేసింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ పనులు ఈ నెలాఖ రున పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో పనులు పూర్తికావడంపై అనుమానాలు నెలకొన్నాయి. వాస్తవానికి గత నెలలోనే అన్ని మండలాల్లో ఈ పనులు ప్రారంభించాలి. అని వార్య కారణాలతో ఆలస్యంగా మొదలయ్యాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం పనులు కొనసాగుతుండగా.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇంకా మొదలు పెట్టలేదని తెలుస్తోంది. యుద్ధ ప్రతిపాదికన రోడ్డు నిర్మాణాలు పూర్తిచేసేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మార్చి 31లోగా జిల్లాకు మంజూరైన పనులన్నింటి నీ పూర్తిచేయని పక్షంలో నిధులు వెనక్కి వెళ్లిపోనున్నాయి. గతేడాది కూడా సకాలంలో పనులు ప్రారంభించని కారణంగా ఈజీఎస్ నిధులు వెనక్కివెళ్లిపోయాయి.
పర్యవేక్షణతోనే పనుల్లో నాణ్యత
ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాకు మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించి, పూర్తి చేసేందు కు కేవలం 24 రోజుల గడువు మాత్రమే మిగిలింది. తక్కువ సమయంలో హడావుడిగా చేపట్టే పనుల్లో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. గ్రామాల్లో పనులన్నీ ఏకకాలంలో ప్రారంభమైతే ఇంజినీరింగ్ అధి కారుల పర్యవేక్షణ లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. మండలానికి ఒక్క ఏఈఈ మాత్రమే ఉన్నారు. వారు ఒక్కరే అన్ని పనులను పర్యవేక్షించడం సా ధ్యం కాదు. కాంట్రాక్టర్లు సిమెంట్, ఇసుక, కంకర సమపాళ్లలో వాడకుండా నాసిరకమైన పనులు చేప ట్టే అవకాశం ఉంది. రోడ్లు పూర్తయిన కొన్నాళ్లకే బీ టలు వారే ప్రమాదం ఉంది. సీసీరోడ్డు నిర్మాణ ప నులు పూర్తయ్యాక కనీసంగా 15 రోజులపాటు త ప్పనిసరిగా క్యూరింగ్ చేయాలి. కానీ కాంట్రాక్టర్లు ఒకటి, రెండు రోజులే క్యూరింగ్ చేసి చేతులు దు లుపుకొంటున్నారు. కొద్దిరోజులకే రోడ్లు కంకర తేలి దెబ్బతింటున్నాయి. గతంతో పోల్చితే ఈసారి త క్కువ సమయం మాత్రమే ఉండటంతో పనుల్లో నా ణ్యతపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
సకాలంలో పూర్తిచేస్తాం
జిల్లాకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి రూ.13 కోట్ల ఈజీఎస్ నిధులతో 354 పనులు మంజూరయ్యాయి. ఇందులో కొన్నిరోడ్లు ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయి. మిగిలిన పనులు కూడా ఈ వారంలోగా ప్రారంభిస్తాం. సకాలంలో పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్, మిషనరీ సమకూర్చుకుంటున్నారు. దీంతో పనులు పూర్తి చేయడం తేలిక అవుతుంది.
– ప్రభాకర్, పంచాయతీరాజ్ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment