క్రీడాపాఠశాలలో ప్రవేశానికి అర్హత పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ప్రవేశానికి బాలబాలికలకు అర్హత పోటీలు నిర్వహించినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలికల క్రీడా పాఠశాలలో ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలను గురువారం జెండా ఊపి ప్రారంభించారు. డీ టీడీవో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా అర్హత క్రీ డాపోటీలకు 105 మంది బాలికలు, 64 మంది బాలురు హాజరయ్యారని తెలిపారు. తొ మ్మిది అంశాల్లో క్రీడాపోటీలు నిర్వహించామన్నారు. ప్రతిభ చూపిన బాలురులకు ఈ నెల 10న ఉట్నూర్‌లో, ఈ నెల 12న జిల్లా కేంద్రంలో బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, పీడీలు, పీఈటీలు పాల్గొన్నా రు.
Comments
Please login to add a commentAdd a comment