ఆసిఫాబాద్‌రూరల్: బాలికలు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని పట్టుదలతో అనుకున్నది సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లోని జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో గురువారం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో.. బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికలను బతికించుకుని.. వారిని ఉన్నతస్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, శిశు సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment