నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అంకుసాపూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో ప్రతి మొక్కనూ రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవి నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా నీటిని అందించాలని ఆదేశించారు. ఉపాధిహామీ సిబ్బంది నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అనంతరం మండలంలోని ఎల్లారంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించారు. ఎండాకాలంలో ఉపాధిహామీ కూలీల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరికి పని కల్పించాలన్నారు. ఆయన వెంట డీఆర్‌డీవో దత్తారావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment