వార్షిక లక్ష్య సాధనకు కృషి చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక లక్ష్య సాధనకు ప్రతిఒక్కరూ కృషి చే యాలని ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి సూచించారు. ఏరియాలోని కై రిగూడ ఓసీపీని గురువారం సందర్శించారు. ఫిబ్రవరిలో కైరిగూడలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన షావల్ ఆపరేటర్, డంపర్ ఆపరేటర్లతోపాటు ఇతర ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ 2024– 25 ఆర్థిక సంవత్సరంలో కైరిగూడ ఓసీపీకి నిర్దేశించిన 37.5లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు ఉద్యోగులంతా స మష్టిగా కృషి చేయాలని అన్నారు. ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి శంకర్, ప్రాజె క్టు ఇంజినీరు వీరన్న, సేఫ్టీ అధికారి నారాయణ, డీవైపీఎం వేణు, ఏఐటీయూసీ నాయకులు దివాకర్, ఓదెలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment