ఆసిఫాబాద్: వేసవిలో అంతరాయం లేకుండా వి ద్యుత్ సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళిక సి ద్ధం చేసినట్లు ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజి నీర్ రాథోడ్ శేషారావు తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం మాట్లాడారు. సర్కిల్ పరిధిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో రెండుచోట్ల 3.15 ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నాలుగు చోట్ల 3.15 ఎంవీఏ టీవో, 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటనెన్స్ సమయంలో ఒక లైన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా వినియోగదారులకు ప్రత్యామ్నాయ లైన్(ఇంటర్‌లింక్ లైన్) ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా ఎనిమిది చోట్ల లింకింగ్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఓవర్‌లోడ్ పెరిగే అవకాశం ఉన్నచోట 36 అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. మరో 8 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచామని పేర్కొన్నారు. బంచ్ ఫీడర్లు ఉన్న చోట ఇప్పటివరకు కొత్తగా 10 వీసీబీలు అమర్చామని తెలిపారు. భారీ వర్షాలకు విద్యు త్ అంతరాయం ఏర్పడితే.. వేగంగా పునరుద్ధరించేందుకు బ్రేక్ డౌన్ టీంలు ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫర్మర్ స్ట్రక్చర్‌ల వద్ద సరీసృపాలతో షార్ట్ సర్క్యుట్ కాకుండా 474 ప్రాంతాల్లో మోనోపాస్ట్‌లు ఏర్పాటు చేశామని వివరించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment