ఇంటర్ సెకండియర్ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ సెకండియర్ వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ని రెండు నియోజకవర్గాల్లో 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,984 మంది విద్యార్థులకు 4,855 మంది హాజరు కాగా, 129 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,248 మందికి 4,148 మంది, ఒకేషనల్ విభాగంలో 736 మందికి 707 మంది పరీక్ష రాశారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డీఐఈవో కళ్యాణి తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, వాంకిడిలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment