● ‘పీఎంశ్రీ’ పాఠశాలలకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభ
కెరమెరి(ఆసిఫాబాద్): నిత్యం నాలుగు గోడల మ ధ్య పాఠ్యాంశాల్లో మునిగిపోయే విద్యార్థులు సాధారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీరికి కొంత ఊరట కలిగించేందుకు ఉపాధ్యాయులు ఏటా విద్యార్థులను సొంత ఖర్చులతో విజ్ఞాన, విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. అయితే సొంత డబ్బులు వెచ్చించే స్తోమత పేదింటి విద్యార్థులకు ఉండదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారు విహారయాత్రకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ (పీఎంశ్రీ) స్కీంను తెచ్చి జిల్లాలో 18 పాఠశాలలను ఇందుకు ఎంపిక చేసింది. ఈ పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. సర్కారు పాఠశాలల అభివృద్ధికి వివిధ రకాలుగా తోడ్పాటునందిస్తోంది. ఫర్నిచర్, పెయింటింగ్ ఇతర అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. దీంతో పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలలు ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి.
ఒక్కో విద్యార్థికి రూ.500
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేదకుటుంబాలకు చెందినవారే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి సర్కారు స్కూళ్లలో చదువుకుంటున్నవారే. ఇలాంటి వారికి బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు గాను విజ్ఞాన, విహారయాత్రల కోసం ఒక్కో విద్యార్థికి రూ.500 విడుదల చేసింది. దీంతో ఆయా పాఠశాలల నిర్వాహకులు విద్యార్థులకు సమీప చరిత్రాత్మక ప్రదేశాలను చూపించేందుకు విహార, విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తున్నారు. ఇటీవల పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల విద్యార్థులందరినీ అత్యధికంగా కెరమెరి మండలంలోని జోడేఘాట్‌తోపాటు చంద్రాపూర్‌లోని వి సాపూర్ బొటానికల్ గార్డెన్‌కు తీసుకెళ్తున్నారు. జోడేఘాట్‌లోని కుమురంభీమ్ మ్యూజియం, కుమురంభీమ్ ప్రతిమ, సమాధి, నృత్యం చేస్తున్న గుస్సాడీలు, ఆదివాసీల ఆభరణాలు, వాయిద్యాలు, వేటకు వాడే పనిముట్లు, ఆదివాసీల దేవతల ప్రతిమలను విద్యార్థులు తిలకించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రాపూర్‌లోని బొటానికల్ గార్డెన్‌లో మానవ శరీర నిర్మాణం, మైక్రోస్కోప్, 360 డిగ్రీస్ స్క్రీన్ కలిగిన థియేటర్‌లో త్రీడి ఎనిమల్ డాక్యుమెంటరీ, రాకెట్, న్యూటన్ నియమాలు, కండర వ్యవస్థ, ప్రపంచపు అతిపెద్ద పుష్పం, గుండె రక్తప్రసరణ, పాకే మొక్కల తీగలు తదితర అంశాల గురించి ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.
విద్యార్థుల చేతికి ట్యాబ్‌లు
సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్లు మంజూరు చేయగా.. జాతీయ విద్యావిధానంలో భాగంగా పిల్ల లను సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు పీఎంశ్రీలో భాగంగా ట్యాబ్‌ల ద్వారా బోధిస్తున్నారు. పీఎంశ్రీకి 14 ఉన్నత పాఠశాలలు ఎంపిక కాగా ఒక్కోదానికి 25 ట్యాబ్‌ల చొప్పున మంజూరయ్యాయి. వీటిని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అందించి పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు వినియోగిస్తున్నారు.
జిల్లాలో పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలలు
ఉన్నత పాఠశాలలు 14
ప్రాథమికోన్నత పాఠశాలలు 2
ప్రాథమిక పాఠశాలలు 2
విద్యార్థుల సంఖ్య 6,475
● ‘పీఎంశ్రీ’ పాఠశాలలకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభ
● ‘పీఎంశ్రీ’ పాఠశాలలకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభ
Comments
Please login to add a commentAdd a comment