వేతనాలు చెల్లించాలని నిరసన
పెంచికల్‌పేట్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ఎల్కపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం పలువురు కా ర్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఎనగందుల తిరుపతి మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌లో బుచ్చక్క, జయ, సుగుణ, పంచా యతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మల్ల క్క, నిర్మలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిచేసిన కాలానికి వెంటనే జీతాలు మంజూరు చేయాలని కోరారు. వీరికి బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బీజేపీ నాయకుడు హరీశ్, కాంగ్రెస్ నాయకుడు రమేశ్ మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment