● పని ప్రదేశంలో వసతులు కరువు ● ఎండలోనే పని చేస్తున్న కూ
గిట్టుబాటు కావడం లేదు
గతంలో ఎండకాలం పనులు చేసినప్పుడు వేతనంతో పాటు వేసవి భత్యం అందజేసేవారు. ప్రస్తుతం ఎలాంటి అదనపు భత్యాలు లేకపోవడంతో కూలి గిట్టుబాటు కావడం లేదు. బయట వేరే పనులు దొరకకపోవడంతోనే ఉపాధి పనులకు వెళ్తున్నాం.
– రమేశ్, ఉపాధి కూలీ, నవేగూడ,
వాంకిడి మండలం
మౌలిక వసతులు కల్పించాలి
చాలాచోట్ల పని ప్రదేశాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. దీంతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. పని ప్రదేశంలో తప్పనిసరిగా టెంట్, తాగునీటి సౌక్యరం కల్పించాలి. సౌక్యరాలు కల్పించకుంటే ఆందోళన చేస్తాం.
– నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు
తిర్యాణి: దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభించిన నుంచి గ త మూడేళ్ల దాకా పనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. 2022వ ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు. కాగా, ఉపాధి కూలీలకు క్షేత్రస్థాయిలో సరైన సౌక్యరాలు కల్పించకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 91,721 యాక్టీవ్ జాబ్ కార్డులుండగా.. 1,70,268 మంది కూలీలు పని చేస్తున్నారు.
ఎండలోనే పనులు చేస్తూ..
జిల్లాలో వారంరోజులుగా ఎండలు జోరందుకున్నా యి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో న మోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే భా నుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఉపాధి కూలీలు పని ప్రదేశాల్లో త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జిల్లా అధికారుల ఆదేశాలతో పని ప్రదేశంలో కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లతో పాటు తాగునీటి సదుపాయం క ల్పించారు. కూలీలకు గాయాలైనప్పుడు చికిత్స అందించేందుకు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచారు. కానీ.. ఈ ఏడాది పనులు ప్రారంభమై రెండు వారాలైనా ఇప్పటివరకు చాలా పని ప్రదేశాల్లో కూలీలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో వారు ఎండలోనే పనులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కూలీలకు పని ప్రదేశంలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఒక్కో కూలీకి రూ.2.50 చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కానరాని అదనపు భత్యం
పాత సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యం పేరిట ఫిబ్రవరి నుంచి జూన్ వరకు చేసిన పనికి వచ్చే వేతనంతో పాటుగా 20–35శాతం వరకు ఆదనంగా కలిపి ఇ చ్చేవారు. అంతే కాకుండా పని ప్రదేశం ఊరి నుంచి ఐదు కిలో మీటర్ల కన్నా దూరంగా ఉంటే కిలో మీట రుకు కొంత చొప్పున జమచేయడంతో పాటు పార, గడ్డపార వినియోగించినందుకు కూలీలకు అదనపు భత్యం అందజేసేవారు. గతంలో గడ్డపారలు కూ డా ప్రభుత్వమే కూలీలకు ఉచితంగా సరఫరా చేసే ది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చెల్లింపులు చేపట్ట డం లేదు. దీంతో కూలీలకు వేతనం గిట్టుబాటు కాక ఉపాధి పనులపై అనాసక్తి చూపుతున్నారు.
అసౌకర్యాల ‘ఉపాధి’
ఈ చిత్రంలో కనిపిస్తున్నది తిర్యాణి మండలం చింతపెల్లి పంచాయతీ పరిధి చెలిమల వాగు వద్ద చేపల కుంటలో పూడిక తీస్తున్న కూలీలు. నిబంధనల ప్రకారం పంచాయతీ అధికారులు పని ప్రదేశంలో టెంట్, తాగునీరు, ఫస్ట్‌ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ.. ఇక్కడ అవేమీ కనిపించలేదు. ఎండలోనే కూలీలు పనులు చేస్తున్నారు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీటినే తాగుతున్నారు. ఈ పరిస్థితి ఈ ఒక్కచోటే కాదు.. జిల్లాలోని అత్యధిక పని ప్రదేశాల్లో కనిపిస్తుంది.
● పని ప్రదేశంలో వసతులు కరువు ● ఎండలోనే పని చేస్తున్న కూ
● పని ప్రదేశంలో వసతులు కరువు ● ఎండలోనే పని చేస్తున్న కూ
Comments
Please login to add a commentAdd a comment