ఫీజు రాయితీని వినియోగించుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన
ఆసిఫాబాద్: ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కల్పించిన ఫీజు రాయితీని యజమానులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూ చించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దరఖాస్తుదారులు, సబ్‌రిజి స్ట్రార్ రైటర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించిందని తెలిపారు. ఈ నెల 31లోపు ఫీజు చె ల్లించినవారికి 25 శాతం రాయితీ ఇవ్వనుందని పే ర్కొన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలో 3,529 దరఖాస్తులు రా గా, 3,102 దరఖాస్తులను గుర్తించి ఎల్‌ఆర్‌ఎస్ చే సుకోవాలని లేఖలు పంపించినట్లు తెలిపారు. 335 గ్రామపంచాయతీల పరిధిలో 4,170 దరఖాస్తులు రాగా, 1,665 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నా రు. ఇప్పటివరకు 32 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఫీజు చెల్లించి ప్రొసీడింగులు పొందినట్లు తెలిపారు. గతంలోలాగా కాకుండా ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ రు సుం చెల్లిస్తే సంబంధిత అధికారులు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్లాట్లు రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ రుణసౌకర్యం కూడా పొందవచ్చని తెలిపారు. సమస్యలు ని వృత్తి చేసుకునేందుకు గ్రామపంచాయతీ, మున్సి పల్ అధికారులను నేరుగా సంప్రదించాలని పేర్కొన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ హెల్ప్ డెస్క్‌ను 6300688040, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ హెల్ప్ డెస్క్‌ను 966648821 నంబర్లలో, గ్రామపంచాయతీల్లో కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, టౌన్‌ప్లానింగ్ అధికారి యశ్వంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment