మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సెషన్ జడ్జి ఎంవీ రమేశ్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కో ర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్, జూ నియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి జిల్లా, జడ్జి సతీ మణితో పాటు మహిళా న్యాయమూర్తులు, సి బ్బందిని శాలువాలతో సన్మానించారు. పూల మొక్క బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే ఏదైనా సాధించవచ్చని, ప్రతీ ఒక్కరికి విద్య ప్రాముఖ్యతను వివరించాలని పేర్కొన్నారు. మహిళా న్యాయవాదులు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్, గాయత్రి, మధురిమ, స్వప్న, ప్రత్యూష, సురేశ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment