మహిళా సంఘాల అభివృద్ధికి మరో అవకాశం
ఆసిఫాబాద్: మహిళా సంఘాల అభివృద్ధి కో సం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సంఘాల అభివృద్ధి దిశగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం మహిళా సంఘాల అద్దె బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి వెళ్లిన రెండు బస్సులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా దినో త్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ప్రతీ మహిళా సమాఖ్యకు ఒక బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నుంచి 100 మంది మహిళా సంఘాల సభ్యులు రెండు బస్సుల్లో వెళ్లినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment