సమాన పనికి సమాన వేతనం అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు. శనివా రం జిల్లా కేంద్రంలోని బాలికల డిగ్రీ కళాశాలలో ‘ప్రమాదంలో మహిళల హక్కులు– మన కర్తవ్యం’ అనే అంశంపై మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా చైల్డ్ కేర్ లీవ్ రెండేళ్లకు గాను ఇవ్వాలని, కాంట్రాక్ట్ సిస్టంలో పని చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న వారి కి భారతీయ లేబర్ కోడ్‌కు అనుగుణంగా మి నిమం పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు తిరుమల, శారద, సబిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment