వైద్యకళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ వైద్యకళాశాలకు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచా ర్య కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివా రం నిర్వహించిన అఖిల భారత పద్మశాలి సంఘం 17వ మహాసభ వేదికపై ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. కళాశాల ఏర్పాటు నుంచీ జిల్లాకు చెందిన అనేక మంది తెలంగాణవాదులు, అభిమానులు మెడిక ల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నా మకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఉద్యమకారుడికి గుర్తింపు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మంత్రులు, కలెక్టర్‌తోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వ వైద్యకళాశాలకు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు నామకరణం చేస్తామని సీఎం ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment