జిల్లా క్రీడాకారులకు పతకాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): హర్యానా రాష్ట్రంలోని కర్ణాల్‌లో జరిగిన 73వ ఆల్ ఇండియా పోలీస్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్ టీం ఈవెంట్‌లో రాష్ట్ర జట్టు తరుఫున బరిలో దిగిన జిల్లా క్రీడాకారులు కాంస్య పతకాలు సాధించినట్లు సెపక్‌తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 7 నుంచి జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో రెబ్బెన మండలానికి చెందిన పోలీస్ క్రీడాకారులు ఆర్.వెంకటేశ్, ఆడే రాజేందర్, పి.గోపి అద్భుత ఆట తీరు ప్రదర్శించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు సాధించిన పోలీ స్ క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ ఉ మ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, సెపక్ తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment