డిగ్రీ విద్యార్థినుల ప్రతిభ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న మహిళా డిగ్రీ గురుకులానికి చెందిన విద్యార్థినులు మౌంటెన్ బైక్ సైక్లింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శారద సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన తొమ్మిదో రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్‌లో కళాశాలకు చెందిన స్నేహ టైం ట్రయల్ 20 కిలోమీటర్లు, మాస్ స్టార్ట్స్ 40 కిలోమీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించిందని తెలిపారు. అలాగే వాణిశ్రీ రజత పతకం, ప్రియాంక కాంస్య పతకం, శ్రీదేవి రజత పతకం సాధించారని వెల్లడించారు. విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని పీడీ హారిక ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment