ఉద్యోగులకు అభినందన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ ఓసీపీ గడిచిన ఫిబ్రవరిలో అధిక ఉత్పత్తిని సాధించడంతో ఓసీపీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అభినందించారు. సోమవారం కై రిగూడ ఓసీపీని సందర్శించి కై రిగూడ ఓసీపీ 135 శాతం బొగ్గు ఉత్పత్తి సాధనకు కృషి చేసిన ఉద్యోగులను ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియాకు 37.5లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 21 రోజుల గడువు మిగిలి ఉందని, వందశాతం ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి నరేందర్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు మొ గిళి, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, సేఫ్టీ అధికారి నారా యణ, మేనేజర్ శంకర్, డీవైపీఎం వేణు, నాయకులు శేషు, దివాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment