కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,046 మంది విద్యార్థులకు 4,917 మంది హాజరుకాగా, 129 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 4,315 మందికి 4,207 మంది, ఒకేషనల్ వి భాగంలో 731 మందికి 710 మంది హాజరయ్యారని డీఐఈవో కళ్యాణి తెలిపారు. ఆసిఫాబాద్, కౌటాల, దహెగాంలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సౌకర్యాల కల్పన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment