పదోన్నతితో మరింత బాధ్యత
ఆసిఫాబాద్‌అర్బన్/కెరమెరి: పదోన్నతితో ఉద్యోగిపై మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. కెరమెరి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న జాదవ్ ఉల్లాస్ ఎస్సైగా పదోన్నతి పొందగా, సోమవారం జిల్లా కేంద్రంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. 1989లో ఉల్లాస్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందగా 2012లో హెడ్ కానిస్టేబుల్, 2000లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయనను జైనూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా నియమించారు. గతంలో ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, సోన్, నీల్వాయి, కెరమెరి పోలీస్ స్టేషన్‌లలో పనిచేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఎస్పీకి మొక్క అందిస్తున్న ఎస్సై ఉల్లాస్
Comments
Please login to add a commentAdd a comment