సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల ని డీవైఎఫ్‌ఐ, టీఏజీఎస్ నాయకులు మంగళవారం కలెక్టరేట్‌లో ఏవో మధుకర్‌కు వినతిపత్రం అందించారు. నాయకులు కార్తీక్, మాల శ్రీ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజ లకు కనీస వసతులు కూడా లేవన్నారు. ట్రా ఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బంది ప డుతున్నారని, వ్యాపారులు పగటిపూటే భారీ వాహనాలు రోడ్లపై నిలుపుతున్నారని ఆరో పించారు. గోదాంలను కాలనీల్లో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నా రు. పట్టణంలో సులభ్ కాంప్లెక్స్‌లు, పా ర్కింగ్ స్థలాలు, తాగునీటి కోసం చలివేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జన్కాపూర్ మైదానానికి ప్రహరీ నిర్మించి, సెక్యూరిటీ పెంచాలన్నారు. నాయకులు శ్రావణి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment