నాణ్యతతో పనులు చేపట్టాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలో చేపడుతున్న పనుల్లో నాణ్య త పాటించాలని పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్‌ఈ సూర్యప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వి విధ మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద పనులు చేపడుతున్న ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులకు పంచాయతీరాజ్ ఈఈ ప్రభాక ర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్‌ఈ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో పనులు పూర్తిచేయడంతోపాటు నాణ్యత ప్రమాణాలు పాటించి నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నా రు. రానున్న రోజుల్లో నాణ్యత పరీక్షించిన త ర్వాతే బిల్లుల చెల్లింపులు జరుగుతాయని స్ప ష్టం చేశారు. పనులు పూర్తిచేయడంలో అలసత్వం ప్రదర్శించొద్దని హెచ్చరించారు. సమావేశంలో డీఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment